మళ్లీ భయపెట్టడానికి రెడీ! | Nayanthara Next Film Act with Doss Ramaswamy's Film | Sakshi
Sakshi News home page

మళ్లీ భయపెట్టడానికి రెడీ!

Jun 14 2016 11:44 PM | Updated on Sep 4 2017 2:28 AM

మళ్లీ భయపెట్టడానికి రెడీ!

మళ్లీ భయపెట్టడానికి రెడీ!

‘మయూరి’ వంటి హారర్ చిత్రంతో ప్రేక్షకులను భయపెట్టిన నయనతార మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు.

 ‘మయూరి’ వంటి హారర్ చిత్రంతో ప్రేక్షకులను భయపెట్టిన నయనతార మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు. మురగదాసు రామస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై తెలుగులో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు.
 
 ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలు చెబుతూ- ‘‘ఇప్పటి వరకూ వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. నయనతార పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నెల 18 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: దినేష్, సంగీతం: వివేక్.
 

Advertisement
 
Advertisement
Advertisement