నయన నైట్ షో | nayantara to cast in night show movie | Sakshi
Sakshi News home page

నయన నైట్ షో

Jun 18 2014 10:53 PM | Updated on Oct 17 2018 5:37 PM

నయన నైట్ షో - Sakshi

నయన నైట్ షో

స్టార్ హీరో... స్టార్ డెరైక్టర్... స్టార్ ప్రొడ్యూసర్... ఇలా ఒక స్టార్ వేల్యూ ఉంటేనే నయనతార సినిమా చేస్తారు. దాంతో పాటు చుక్కలనంటే పారితోషికం తప్పనిసరి.

స్టార్ హీరో... స్టార్ డెరైక్టర్... స్టార్ ప్రొడ్యూసర్... ఇలా ఒక స్టార్ వేల్యూ ఉంటేనే నయనతార సినిమా చేస్తారు. దాంతో పాటు చుక్కలనంటే పారితోషికం తప్పనిసరి. ఇది నిన్నటి మాట. తాజాగా, నయనతార ఓ చిన్న బడ్జెట్ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ఆ సినిమాకి నూతన దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించనుండటం ఓ విశేషం కాగా, ఇప్పుడిప్పుడే పైకొస్తున్న ఆరి అనే నటుడి సరసన ఆమె నటించనుండటం మరో విశేషం. ఇప్పటివరకు అగ్రదర్శకుల చిత్రాల్లోనే నటించిన నయనతార ఓ కొత్త దర్శకునికి కాల్షీట్లు ఇవ్వడం టాక్ ఆఫ్‌ది కోలీవుడ్ అయ్యింది.
 
 పైగా, ఇది చిన్న బడ్జెట్ చిత్రం కావడం వల్ల నయనతార పారితోషికం కూడా ఇప్పుడు తను తీసుకుంటున్న ఇతర చిత్రాలకు ఉన్నంత ఉండకపోవచ్చు. ఇది హారర్ నేపథ్యంలో సాగే సినిమా. ఈ కథను ఇటీవల నయనతారకు చెప్పారట అశ్విన్. కథ, తన పాత్ర బాగా నచ్చడంతో ఇతర విషయాల గురించి ఆలోచించకుండా ఈ సినిమా చేయడానికి ఆమె ఒప్పుకున్నారని తెలిసింది. అతి తక్కువ రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారని, అందుకని నయనతార వరుసగా డేట్స్ కూడా ఇచ్చేశారని సమాచారం. దీనికి ‘నైట్ షో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement