రాజమౌళి శిష్యుడి నయనం | Nayanam Logo Launched By Raj Kandukuri | Sakshi
Sakshi News home page

రాజమౌళి శిష్యుడి నయనం

Oct 6 2017 2:02 AM | Updated on Oct 6 2017 4:45 AM

Nayanam Logo Launched By Raj Kandukuri

ప్రముఖ దర్శకుడు రాజమౌళి వద్ద ‘ఈగ, మర్యాద రామన్న, మగధీర’ చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన క్రాంతికుమార్‌ వడ్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నయనం’. ఎస్తేర్, నోయల్, శ్రీ మంగం, అర్జున్‌ ఆనంద్‌ ప్రధాన పాత్రల్లో రామ్‌ కేతు, కృష్ణమోహన్, శ్రీరామ్‌ కందుకూరి, నరేన్‌ లేబాకు నిర్మించిన ఈ సినిమా టైటిల్‌ లోగోని నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. ‘‘సస్పెన్స్, థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. టైటిల్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది’’ అన్నారు క్రాంతికుమార్‌. నిర్మాతల్లో ఒకరైన శ్రీరామ్‌ కందుకూరి మాట్లాడుతూ– ‘‘దీపావళికి టీజర్‌ను, నవంబర్‌లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement