లచ్చిందేవి లెక్కలు | Naveen Chandra, Lavanya Tripathi New movie | Sakshi
Sakshi News home page

లచ్చిందేవి లెక్కలు

Aug 24 2015 12:10 AM | Updated on Sep 3 2017 8:00 AM

లచ్చిందేవి లెక్కలు

లచ్చిందేవి లెక్కలు

‘అందాల రాక్షసి’ చిత్రంతో హిట్ పెయిర్ అనిపించుకున్న నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి నటిస్తున్న తాజా చిత్రం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’.

 ‘అందాల రాక్షసి’ చిత్రంతో హిట్ పెయిర్ అనిపించుకున్న నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి నటిస్తున్న తాజా చిత్రం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. రాజమౌళి దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేసిన జగదీశ్ తలశిల ఈ చిత్రానికి ద ర్శకుడు. మయూఖ క్రియేషన్స్ పతాకంపై సాయిప్రసాద్ కామినేని నిర్మిస్తున్న ఈ చిత్రం లోగో, టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ‘‘ఈ చిత్రానికి ముఖ్యమైన సూతధ్రారి, పాత్రధారి డబ్బే అని, కథాంశం ఆసక్తికరంగా ఉంటుందని, ఇందులో మొత్తం ఐదు పాటలుంటాయి’’ అని చిత్రసంగీతదర్శకుడు కీరవాణి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదొక కామెడీ ఎంటర్‌టైనర్. ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకునేలా రూపొందిస్తున్నాం. మంచి మ్యూజిక్ మూవీ అవుతుంది’’ అని తెలిపారు. కీరవాణిగారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని హీరో నవీన్ చంద్ర అన్నారు. ‘‘ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్‌గా నిలిచే వాటిలో మా చిత్రం ఉంటుంది’’ అనే నమ్మకాన్ని నిర్మాత వ్యక్తపరిచారు.
 

Advertisement
 
Advertisement
Advertisement