నాని.., విలనా..? హీరోనా..? | nani next film title gentleman | Sakshi
Sakshi News home page

నాని.., విలనా..? హీరోనా..?

Apr 15 2016 10:32 AM | Updated on Sep 3 2017 10:00 PM

నాని.., విలనా..? హీరోనా..?

నాని.., విలనా..? హీరోనా..?

ప్రయోగాల బాట పట్టాక వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న నాని మరోసారి అదే మ్యాజిక్ను రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ప్రయోగాల బాట పట్టాక వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న నాని మరోసారి అదే మ్యాజిక్ను రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తనను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ ఎంటర్టైనర్తో అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఫస్ట్ లుక్ పోస్టర్ను శ్రీరామ నవమి సంధర్భంగా రిలీజ్ చేశారు.
 
హీరోనా..? విలనా..? అన్న ప్రశ్నతో రూపొందించిన ఈ పోస్టర్లో నాని కొత్తగా కనిపిస్తున్నాడు. నాని లుక్ పాటు ఈ సినిమా టైటిల్ను కూడా ఎనౌన్స్ చేశారు. జెంటిల్మన్ పేరుతో రూపొందుతున్న  ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మళయాలి భామ నివేదా థోమస్, సురభిలు హీరోయిన్లుగా నటిస్తున్న జెంటిల్మన్ సినిమాలో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement