‘ఐ వాన్న ఫ్లై’ అంటున్న నాని | Nani Krishnarjuna Yuddham Second Single | Sakshi
Sakshi News home page

Feb 24 2018 11:46 AM | Updated on Feb 24 2018 1:13 PM

Nani in Krishnarjuna Yuddham - Sakshi

‘కృష్ణార్జున యుద‍్ధం’ సినిమాలో నాని

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని ఈ రోజున తన పుట్టిన రోజు జరపుకుంటున్నారు. నాని ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకం.. హీరోగానే కాదు నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకున్న తరువాత నాని జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు ఇదే. అంతేకాదు నానితో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న, త్వరలో సినిమాలు చేయబోయే నిర్మాణ సంస్థలు కూడా నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాయి.

ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం చిత్రయూనిట్‌ పుట్టిన రోజు కానుకగా సినిమాలోని మరో పాటను రిలీజ్ చేసింది ఇప్పటికే ‘దారి చూడు’ పాటతో సంచలనం సృష్టించగా తాజాగా రెండు జంట నేపథ్యంలో వచ్చే రొమాంటిక్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకుడు. హిప్‌ హాప్ తమిళ సంగీత సారథ్యంలో రేవంత్, సంజిత్‌ హెగ్డే ఆలపించిన ఐ వాన్న ఫ్లై పాటకు శ్రీజో సాహిత్యమందించారు.

Advertisement
 
Advertisement
Advertisement