ఏప్రిల్ 12 నుంచి ‘కృష్ణార్జున యుద్ధం’ | Nani Krishnarjuna Yuddham release date | Sakshi
Sakshi News home page

Dec 28 2017 1:46 PM | Updated on Dec 28 2017 2:02 PM

Nani Krishnarjuna Yuddham release date - Sakshi

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తన నెక్ట్స్ సినిమాను కూడా రిలీజ్ కు రెడీ చేసేస్తున్నాడు. ఇటీవల ఎంసీఏ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న ఈ నేచురల్ స్టార్ ప్రస్తుతం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నాడు. 

నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎంసీఏ ప్రమోషన్ లో పాల్గొన్న నాని కృష్ణార్జున యుద్ధం సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు. తన తదుపరి చిత్రం ఏప్రిల్ 12న రిలీజ్ అవుతుందని వెల్లడించాడు నాని.

Advertisement
 
Advertisement
Advertisement