మీ టూ : నానా పటేకర్‌కు క్లీన్‌ చిట్‌

Nana Patekar receives clean chit Over MeToo Allegations - Sakshi

ముంబై : లైంగిక వేధింపుల ఆరోపణలపై అలోక్‌ నాధ్‌, వికాస్‌ బల్‌లు క్లీన్‌ చిట్‌ అందుకున్న క్రమంలో తాజాగా మీటూ ఆరోపణలపై బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌కూ క్లీన్‌ చిట్‌ లభించింది. నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ లభించనందున కేసును మూసివేసినట్టు సమాచారం. కాగా నానా పటేకర్కు క్లీన్‌ చిట్‌ లభించిందని గతంలోనూ వార్తలు వెలువడగా ఆయనపై ఆరోపణలు గుప్పించిన తనుశ్రీ దత్తా వాటిని వదంతులుగా తోసిపుచ్చారు. నానా పటేకర్‌ పీఆర్‌ బృందం ఈ వదంతులను వ్యాపింపచేస్తున్నారని తనుశ్రీ ప్రతినిధి, అడ్వకేట్‌ నితిన్‌ సత్పుటే ఆరోపించారు.

కాగా నానా పటేకర్‌, కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్య, నిర్మాత సమి సిద్ధిఖీ, దర్శకుడు రాకేష్‌ సావంత్‌లు తనపై, తనతో పాటు కారులో ఉన్న కుటుంబ సభ్యులపై దాడిచేశారని తాము ఫిర్యాదు చేయగా పోలీసులు నానా పటేకర్‌కు ఎలా క్లీన్‌ చిట్‌ ఇస్తారని ఇటీవల తనుశ్రీ ప్రశ్నించారు. కాగా, 2008లో హార్న్‌ ఓకే ప్లీస్‌ సెట్‌లో నటుడు నానా పటేకర్‌ తనతో ఇంటిమేట్‌ సీన్‌లో నటించాలని కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్యతో కలిసి ఒత్తిడి చేశారని, అందుకు నిరాకరించడంతో తనతో పాటు తన కారులో ఉన్న కుటుంబ సభ్యులపై వారు దాడికి తెగబడ్డారని తనుశ్రీ దత్తా ఆరోపించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top