నా తొలి సినిమా... నాన్న చివరి సినిమా | Nagarjuna Tweets About His First Movie On 4 Years Of Manam | Sakshi
Sakshi News home page

May 23 2018 1:16 PM | Updated on Jul 15 2019 9:21 PM

Nagarjuna Tweets About His First Movie On  4 Years Of Manam - Sakshi

అక్కినేని కుటుంబానికి మరుపురాని సినిమా ‘మనం’. అక్కినేని మూడు తరాల హీరోలు ఈ సినిమాలో కలిసి నటించారు. పైగా ఏఎన్నార్‌కు ఇది చివరి చిత్రం కావడంతో అక్కినేని కుటుంబానికి ఈ మూవీ ఎంతో ప్రత్యేకం. నేటికి మనం మూవీ రిలిజై నాలుగు సంవత్సరాలైంది. ఈ సందర్భంగా కింగ్‌ నాగ్‌ తన భావాల్ని ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. 

నాన్న నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాం అంటూ ట్వీట్‌ చేసిన నాగ్‌, కొంత సమయం తరువాత.. ‘నా మొదటి సినిమా విక్రమ్‌, మా నాన్న చివరి చిత్రం మనం ఒకే తేదీన (మే 23) విడుదలయ్యాయి. మేము ముందుగా ప్లాన్‌ చేయలేదు. అలా జరిగింది. అంతేకాకుండా ఈ  23ను తిరిగేస్తే 32 వస్తుంది. నేను సినీరంగంలో అడుగుపెట్టి 32 ఏళ్లు అవుతోంది. మా పై ప్రేమను చూపిస్తున్న వారందరికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement