నా రూట్ మారుస్తున్నా... | my root has been changed - nara rohith | Sakshi
Sakshi News home page

నా రూట్ మారుస్తున్నా...

Jul 24 2015 11:12 PM | Updated on Aug 29 2018 3:53 PM

నా రూట్ మారుస్తున్నా... - Sakshi

నా రూట్ మారుస్తున్నా...

‘‘ఇప్పటివరకూ సీరియస్ కథాంశాలనే ఎంచుకున్నాను. ఇక నుంచి రూట్ మార్చి కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో పలకరిస్తా’’ అని హీరో నారా రోహిత్ తెలి పారు.

‘‘ఇప్పటివరకూ సీరియస్ కథాంశాలనే ఎంచుకున్నాను. ఇక నుంచి రూట్ మార్చి కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో పలకరిస్తా’’ అని హీరో నారా రోహిత్ తెలి పారు. ‘బాణం, సోలో, ప్రతినిధి, రౌడీఫెలో, అసుర’ చిత్రాలతో ప్రత్యేకమైన శైలి సొంతం చేసుకున్న నారా రోహిత్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పత్రికల వారితో ముచ్చటిస్తూ ‘‘ఈ ఏడాది మూడు చిత్రాలతో రానున్నా. అవన్నీ పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్స్.
 
 ఆగస్టులో ‘శంకర’ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం. ‘పండగలా వచ్చాడు’ సెప్టెం బర్‌లో రిలీజ్ కానుంది. పవన్ సాదినేని దర్శక త్వంలో ‘సావిత్రి’ సినిమా సెట్స్‌కు వెళు తుంది. పాతబస్తీ నేపథ్యంలో 1990లలో జరిగే కథాంశంతో ‘అప్పట్లో ఒక్కడుండే వాడు’ పేరుతో ఓ సినిమా చేయనున్నా. తమిళంలో మురుగదాస్ కథ అందించిన ‘మాన్ కరాటే’ తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నా’’అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement