నా కాళ్లు పదిహేను ఉత్పత్తులు అమ్ముతున్నాయ్! | My legs sell 12 to 15 products in India: Priyanka Chopra | Sakshi
Sakshi News home page

నా కాళ్లు పదిహేను ఉత్పత్తులు అమ్ముతున్నాయ్!

Sep 15 2016 11:02 PM | Updated on Sep 4 2017 1:37 PM

నా కాళ్లు పదిహేను ఉత్పత్తులు అమ్ముతున్నాయ్!

నా కాళ్లు పదిహేను ఉత్పత్తులు అమ్ముతున్నాయ్!

ప్రియాంకా చోప్రా కాళ్లు కోట్లు సంపాదిస్తున్నాయ్. ఆ కాళ్ల సౌందర్యం అలాంటిది. పాద రక్షలు, కాళ్లను నిగనిగలాడేలా చేసే క్రీములు

 ప్రియాంకా చోప్రా కాళ్లు కోట్లు సంపాదిస్తున్నాయ్. ఆ కాళ్ల సౌందర్యం అలాంటిది. పాద రక్షలు, కాళ్లను నిగనిగలాడేలా చేసే క్రీములు వంటి ఉత్పత్తులకు ఎక్కువగా ప్రియాంకా చోప్రానే బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నారు. కేవలం కాళ్లకు సంబంధించిన 12 నుంచి 15 ఉత్పత్తులను ఆమె ప్రమోట్ చేస్తున్నారు. ఆ విషయం గురించి ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ - ‘‘ఇప్పుడంటే నా కాళ్లు అందంగా ఉన్నాయ్.
 
 అందుకే డజను ఉత్పత్తులకు పైనే అమ్మగలుగుతున్నాయ్. నా టీనేజ్‌లో నా కాళ్లు చూస్తే నాకే చిరాకు అనిపించేది. టామ్‌బాయ్‌లా ఉండేదాన్ని. ఆటలాడినప్పుడు బాగా దెబ్బలు తగిలేవి. ఎప్పుడూ పడిపో తుండేదాన్ని. వాటి తాలూకు మచ్చలతో కాళ్లు భయంకరంగా ఉండేవి. అప్పట్లో ఈ ప్రపంచంలోనే అందవిహీనమైన కాళ్లు ఎవరివి? అంటే అవి నావే. టీనేజ్‌లో స్వతహాగా అందంపై శ్రద్ధ పెరుగుతుంది కదా. వన్ ఫైన్ డే నాక్కూడా కేర్ తీసుకోవాలనిపించింది.
 
 అప్పట్నుంచీ టోటల్ బాడీ మీద శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టా. ఇదిగో ఇప్పుడిలా ఉన్నానంటే అదే కారణం. యావరేజ్‌గా ఉండే నేనే ఈ రేంజ్‌కి మౌల్డ్ అవ్వగలిగానంటే ఎవరైనా కావొచ్చు. పట్టుదల అవసరం. అందం గురించి మాత్రమే కాదు.. ఏది సాధించాలన్నా పట్టుదల, దీక్ష ఉంటే చాలు. సాధించేస్తాం’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement