మణిశర్మ ఇంట్లో విషాదం

Music Director Mani Sharma Father Passed Away - Sakshi

టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుల్లో ఒకరైన మణిశర్మ తండ్రి యనమండ్ర నాగయజ్ఞ శర్మ (92) ఈ రోజు ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచారు. వైయన్‌ శర్మగా సంగీత ప‍్రియులకు సుపరిచితుడైన ఆయన వయోలిన్‌ విద్వాంసులు. ఆయన ప్రోత్సాహంతోనే మణిశర్మ సంగీత దర్శకుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి దాదాపు 175 సినిమాలకు స్వరాలందించారు. వైయన్‌ శర్మ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్‌ కూడా ఇటీవల ఛలో సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి విజయం అందుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top