ప్రేమ యుద్ధం | MEHBOOBA First Look Teaser | Sakshi
Sakshi News home page

ప్రేమ యుద్ధం

Feb 10 2018 12:30 AM | Updated on Feb 10 2018 12:30 AM

MEHBOOBA First Look Teaser  - Sakshi

ఆకాశ్‌ పూరి

సరిహద్దు ప్రాంతం. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. అటు వాళ్లు ఇటు రాకూడదు. ఇటు వాళ్లు అటు రాకూడదు. కానీ ప్రేమ కోసం ఓ రెండు మనసులు మాత్రం హద్దు దాటాయి. ఇప్పుడు వార్‌ దేశాల మధ్య మాత్రమే కాదు. ఈ ప్రేమికుల మనసుల్లో మాత్రం ప్రేమ యుద్ధం. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘మెహబూబా’. పూరీ తనయుడు ఆకాశ్‌ పూరి, నేహాశెట్టి జంటగా నటిస్తున్నారు. 1971 ఇండో–పాక్‌ వార్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం రిలీజ్‌ చేశారు.

‘ఏ వెరీ స్పెషల్‌ ఫిల్మ్‌ టు మి’ అంటూ టీజర్‌ను షేర్‌ చేశారు పూరి జగన్నాథ్‌. టీజర్‌లో ఇండియా, పాక్‌ ఎంట్రన్స్‌ గేట్స్‌ను ఓపెన్‌ చేయడం, వార్‌ జరుగుతున్నప్పుడే ప్రేమను గెలిపించుకోవడం కోసం హీరో, హీరోయిన్లు బోర్డర్‌ దాటేందుకు ప్రయత్నించడం వంటివి ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి. విజువల్స్‌ రిచ్‌గా ఉన్నాయి. సినిమాలో ఇండియన్‌ బాయ్‌గా ఆకాశ్‌ పూరి, పాకిస్తానీ అమ్మాయిగా నేహాశెట్టి కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. విష్ణు రెడ్డి, షాయాజీ షిండే, మురళీ శర్మ, అశ్వని తదితరలు నటిస్తున్న ఈ సినిమాకు సందీప్‌ చౌతా స్వరకర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement