ప్రేయసిని పెళ్లాడిన ఆరి | Sakshi
Sakshi News home page

ప్రేయసిని పెళ్లాడిన ఆరి

Published Thu, Nov 19 2015 6:48 PM

ప్రేయసిని పెళ్లాడిన ఆరి - Sakshi

తమిళసినిమా : నటుడు ఆరి తన ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడారు. ప్రఖ్యాత దర్శకులు కే.బాలచందర్, భారతీరాజా ముఖ్యపాత్రలు పోషించిన 'రెట్టచుళి' చిత్రం ద్వారా ఆరి హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత మాలై పొళుదు మయక్కత్తిలే, ధరణి, నెడుంశాలై తదితర చిత్రాలతో గుర్తింపు పొందిన ఆరి ఇటీవల నయనతారతో నటించిన 'మాయ' చిత్రం మంచి విజయం సాధించింది. కాగా ఆరి శ్రీలంకకు చెందిన నదియ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

నదియ లండన్‌తో తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. బీఏ పట్టభద్రురాలైన నదియ అక్కడే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కాగా ఆరి, నదియ ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో పెళ్లికి సన్నాహాలు జరిగాయి. వీరి వివాహ రిసెప్షన్ మంగళవారం సాయంత్రం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సినీ ప్రముఖులు మాత్రమే ఆ వేడుకకు హాజరయ్యారు. ఆరి, నదియ పెళ్లి బుధవారం ఉదయం 10 గంటలకు నగరంలోని ఒక ఆలయంలో జరిగింది. కాగా వివాహ విషయాన్ని ఆరి బహిరంగ పరచకపోవడం విశేషం.

Advertisement
 
Advertisement
 
Advertisement