మణిరత్నం సినిమాకు ముహూర్తం ఫిక్స్ | Mani Ratnam, Karthi Duet Release Date March 24 | Sakshi
Sakshi News home page

మణిరత్నం సినిమాకు ముహూర్తం ఫిక్స్

Jan 4 2017 2:59 PM | Updated on Sep 5 2017 12:24 AM

మణిరత్నం సినిమాకు ముహూర్తం ఫిక్స్

మణిరత్నం సినిమాకు ముహూర్తం ఫిక్స్

కొంతకాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు తీయటంలో ఫెయిల్ అవుతూ వస్తున్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఓకె బంగారం సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసింది. ఓకె బంగారం

కొంతకాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు తీయటంలో ఫెయిల్ అవుతూ వస్తున్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఓకె బంగారం సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసింది. ఓకె బంగారం సినిమా తరువాత కూడా మరోసారి తన మార్క్ రొమాంటిక్ టచ్తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం. కార్తీ, అదితీరావ్ హైదరీలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ చేశారు  చిత్రయూనిట్. మణిరత్నం తన సొంతం నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్లో స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మార్చి 24న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తెలుగులో డ్యూయెట్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement