నగరం నడిబొడ్డున... | Manchu Vishnu in Ram Gopal Varma's next | Sakshi
Sakshi News home page

నగరం నడిబొడ్డున...

Apr 29 2014 10:43 PM | Updated on Sep 28 2018 4:53 PM

నగరం నడిబొడ్డున... - Sakshi

నగరం నడిబొడ్డున...

రామ్‌గోపాల్‌వర్మ చిత్రాల్లోని పాత్రలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. దానికి తగ్గట్టే తెరపై ఆర్టిస్టుల బిహేవియర్ ఉంటుంది. అందుకే వర్మ దర్శకత్వంలో నటించడం నటీనటులకు

రామ్‌గోపాల్‌వర్మ చిత్రాల్లోని పాత్రలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. దానికి తగ్గట్టే తెరపై ఆర్టిస్టుల బిహేవియర్ ఉంటుంది. అందుకే వర్మ దర్శకత్వంలో నటించడం నటీనటులకు ఓ కొత్త అనుభూతి. ప్రస్తుతం మంచు విష్ణు ఆ అనుభూతినే ఆస్వాదిస్తున్నారు. ఇప్పటికే వర్మ దర్శకత్వంలో ఆయన ‘రౌడీ’ సినిమా చేశారు. ఆ సినిమా ద్వారా నటునిగా మంచి మార్కులే దక్కించుకున్నారు. మళ్లీ వెంటనే వర్మ దర్శకత్వంలో విష్ణు నటిస్తున్నారు.
 
 వెంటవెంటనే ఒకే దర్శకునితో సినిమాలు చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఇదే. అందుకే ఫిలింనగర్‌లో ఇది చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ సినిమా రెండు షెడ్యూల్స్‌ని పూర్తి చేసుకొని మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. హైదరాబాద్ అమీర్‌పేట్ పరిసరాల్లో విష్ణుపై పోరాట దృశ్యాలను వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ -‘‘ ‘రౌడీ’ తర్వాత వెంటనే వర్మతోనే సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అవుట్‌పుట్ అద్భుతంగా వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement