జోరుగా... హుషారుగా... | manchu manoj in ramesh puppala production movie | Sakshi
Sakshi News home page

జోరుగా... హుషారుగా...

Dec 22 2015 12:11 AM | Updated on Sep 3 2017 2:21 PM

జోరుగా...  హుషారుగా...

జోరుగా... హుషారుగా...

మంచు మనోజ్ మంచి జోరుగా.. హుషారుగా ఉన్నారనే చెప్పాలి.

మంచు మనోజ్ మంచి జోరుగా.. హుషారుగా ఉన్నారనే చెప్పాలి. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో మనోజ్ నటించిన ‘ఎటాక్’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో ‘శౌర్య’లో హీరోగా నటిస్తున్నారు. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘మిరపకాయ్’, ‘శ్రీమన్నారాయణ’, ‘పైసా’ చిత్రాల నిర్మాత రమేష్ పుప్పాల నిర్మించనున్న చిత్రంలో మనోజ్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రానికి సాగర్ పసల దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘కమర్షియల్ పంథాలో సాగే ఎంటర్‌టైనర్ ఇది. మనోజ్‌ను సరికొత్తగా చూపించనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, రచన-స్క్రీన్‌ప్లే: కిశోర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement