‘మంచు కురిసే వేళలో’ మూవీ రివ్యూ

Manchu kurise Velalo Telugu Movie Review - Sakshi

టైటిల్‌ : మంచుకురిసే వేళలో 
జానర్‌ : రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌
తారాగణం : రామ్ కార్తీక్‌, ప్రనాలి, యశ్వంత్‌
సంగీతం : శ్రావణ్‌ భరద్వాజ్‌
నిర్మాత, దర్శకత్వం  : బాలా బోడేపూడి

తెలుుగు తెర మీద ప్రేమ కథలు ఎప్పుడు సూపర్‌ హిట్ ఫార్ములానే. అందుకే కొత్తగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలనుకునే వారు ప్రేమ కథలనే ఎంచుకుంటారు. అలాంటి తెలుగు తెర మీద సందడి చేసిన మరో ఆసక్తికర ప్రేమకథ `మంచు కురిసే వేళలో`. దేవా కట్టా లాంటి క్రియేటివ్‌ దర్శకుడి దగ్గర పనిచేసిన బాలా బోడేపూడి దర్శక నిర్మాతగా తెరకెక్కించిన ఈ అందమైన ప్రేమకథ తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? తొలి ప్రయత్నంలో బాలా బోడేపూడి ఏ మేరకు ఆకట్టుకున్నాడు..?

కథ :
ఆనంద్ కృష్ణ( రామ్‌ కార్తీక్‌)  ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటూ రేడియో సిటీలో ఆర్‌జే గా పనిచేస్తుంటాడు. ఆత్మహత్య చేసుకోబోతూ తనకు కాల్ చేసిన ఓ కాలర్‌ను కాపాడే ప్రయత్నంలో తాను బీచ్‌లో పున్నమి వెన్నెల్లో ఓ అందమైన అమ్మాయిని చూసి ప్రేమించానని చెపుతాడు. కానీ ఓ రోజు అలానే నిండు వెన్నెల్లో గీత (ప్రనాలి) అనే అమ్మాయి బీచ్‌లో కనిపించటంతో తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. గీత కూడా తన కాలేజ్‌లోనే జాయిన్‌ అవ్వటంతో ఆమెతో స్నేహం చేస్తాడు. (సాక్షి రివ్యూస్‌) ఎప్పుడూ డల్ గా, మూడీగా ఉండే గీత, ఆనంద్‌తో పరిచయం అయిన తరువాత కాస్త యాక్టివ్‌ అవుతుంది.తన ప్రేమకథనే కాలర్స్‌తో పంచుకున్న ఆనంద్‌ కృష్ణ వాళ్ల ఒత్తిడితో గీతతో ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పేస్తాడు. కానీ గీత, ఆనంద్‌ ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. గీత, ఆనంద్‌ ప్రేమను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి..? గీత గతం ఏంటి..? ఈ ప్రేమకథలో ప్రకాష్(యశ్వంత్‌) ఎవరు..? అన్నద మిగతా కథ.

విశ్లేషణ :
హీరో హీరోయిన్లు కొత్త వారే అయిన తమ పాత్రల్లో ఒదిగిపోయారు. హీరోలుగా నటించిన రామ్‌ కార్తీక్‌, యశ్వంత్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. హీరోయిన్‌గా నటించిన ప్రనాలి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. రెండు వేరియేషన్స్‌ను చాలా బాగా చూపించింది. ఫస్ట్ హాఫ్‌ అంతా మూడీగా, డల్ గా కనిపించిన ప్రనాలి ద్వితియార్థంలో బబ్లీ బబ్లీగా ఆకట్టుకుంది. చాలా చోట్ల త్రిష ను ఇమిటేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేదు. అందమైన ప్రేమకథను కవితాత్మకంగా చెప్పాలనుకున్న దర్శకుడు చాలా వరకు విజయం సాధించాడు. ఏమాత్రం వల్గారిటీ లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రేమకథను అందించారు. (సాక్షి రివ్యూస్‌) అయితే తను అనుకున్న విషయాన్ని పోయటిక్‌గా చెప్పే ప్రయత్నంలో కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ సినిమాటోగ్రఫీ. తిరుజ్ఙాన, ప్రవీణ్‌ కుమార్ తమ కెమెరా పనితనంతో సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చారు. కొన్ని ఫ్రేమ్స్‌ మణిరత్నం సినిమాలను గుర్తు చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా ఊటీలో తెరకెక్కించిన సీన్స్‌ సూపర్బ్‌. శ్రావణ్ భరద్వాజ్‌ సంగీతం కూడా సరిగ్గా కుదిరింది. మెలోడీస్‌తో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమా మూడ్‌ను క్యారీ చేశాయి. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. కొన్ని లెంగ్తీ సీన్స్‌కు కత్తెర పడితే సినిమా ఫీల్ మరోలా ఉండేది. దర్శకుడే నిర్మాత కూడా కావటంతో ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తెరకెక్కించారు.

ప్లస్‌ పాయింట్స్‌ :
సినిమాటోగ్రఫీ
సంగీతం

మైనస్ పాయింట్స్‌ ;
స్లో నేరేషన్‌

సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top