న్యూయార్క్‌లో షికారు చేస్తున్న మహేశ్‌ | Mahesh Shares a Family Photo Of New York Trip | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తున్న మహేశ్‌బాబు

Jan 31 2020 9:42 AM | Updated on Jan 31 2020 12:48 PM

Mahesh Shares a Family Photo Of New York Trip - Sakshi

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సక్స్‌స్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. భరత్‌ అనే నేను, మహర్షి చిత్రాల తరువాత మహేశ్‌కు వరుసగా ఇది మూడో విజయం. ఇక తీరిక లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న ఈ సూపర్‌ స్టార్‌ వాటికి మూడు నెలల పాటు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. వృత్తిలో మునిగి వ్యక్తిగత జీవితాన్ని మర్చిపోవద్దన్న విషయం ఈ హీరోకు బాగా తెలుసు. అందుకే అభిమానులకు ఎంతో ఇచ్చిన ఈ సూపర్‌ స్టార్‌ కుటుంబానికి కాస్త సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాడు.

అనుకున్నదే తడవుగా తన కుటుంబంతో కలిసి న్యూయార్క్‌ పర్యటనకు బయలుదేరాడు. ఇక ఈ మధ్యే తన భార్య నమ్రత శిరోద్కర్‌ పుట్టిన రోజును కూడా అక్కడే సెలబ్రేట్‌ చేశాడు. అంతేకాక ఆయన జాలీ ట్రిప్‌కు సంబంధించిన పలు ఫొటోలను సైతం సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. తాజాగా మరో ఫ్యామిలీ పిక్‌ను నెట్టింట షేర్‌ చేశాడు. ఇందులో మహేశ్‌, నమ్రతతో పాటు సితార, గౌతమ్‌లు కూడా ఉన్నారు. ఈ ఫొటోను చూసస్తే.. ఈ సూపర్‌ స్టార్‌ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్‌ వీధుల్లో ఎంతో ఉల్లాసంగా షికారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి:

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ

నా కెరీర్‌లో ఇలాంటి సంక్రాంతి చూడలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement