స్వర్ణోత్సవ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ | mahesh babu voice over for he's dad next movie | Sakshi
Sakshi News home page

స్వర్ణోత్సవ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ

Mar 4 2016 10:55 PM | Updated on Jul 25 2018 2:35 PM

స్వర్ణోత్సవ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ - Sakshi

స్వర్ణోత్సవ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ

సూపర్ స్టార్ కృష్ణ స్వర్ణోత్సవ చిత్రం ‘శ్రీశ్రీ’కి మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. మహేశ్ ఇంతకు ముందు పవన్ కల్యాణ్ నటించిన ‘జల్సా’కు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

సూపర్ స్టార్ కృష్ణ స్వర్ణోత్సవ చిత్రం ‘శ్రీశ్రీ’కి మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. మహేశ్ ఇంతకు ముందు పవన్ కల్యాణ్ నటించిన ‘జల్సా’కు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల, సీనియర్ నరేశ్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ సాయిదీప్ చాట్ల, వై.బాలురెడ్డి, షేక్ సిరాజ్ నిర్మించిన చిత్రం ‘శ్రీశ్రీ’. ఈ చిత్రానికి మహేశ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని  నిర్మాతలు సంతోషం వెలిబుచ్చారు. ఇటీవలే ఈ చిత్రం పాటలు కూడా భారీగా జరిగిన ఒక వేడుకలో విడుదలయ్యాయి. ‘‘పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శకుడు ముప్పలనేని శివ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement