నిర్మాతగా మారనున్న మహేష్ బాబు! | Mahesh Babu to turn producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగా మారనున్న మహేష్ బాబు!

May 9 2015 8:06 PM | Updated on Sep 3 2017 1:44 AM

గౌతమ్ - కృష్ణ - మహేష్ బాబు

గౌతమ్ - కృష్ణ - మహేష్ బాబు

ప్రిన్స్ మహేష్ బాబు నిర్మాతగా మారనున్నారు.

చెన్నై: ప్రిన్స్ మహేష్ బాబు నిర్మాతగా మారనున్నారు. ప్రస్తుతం 'శ్రీమంతుడు' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. తన కుమారుడు గౌతం పేరుతో స్థాపించే ఈ సినిమా నిర్మాణ సంస్థను తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు మే 31న ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు మషేష్ బాబు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఈ సంస్థ ద్వారా తను నటించే చిత్రాలు మాత్రమే నిర్మించాలా? లేక క్రియేటివిటీతో కూడిన చిన్న చిత్రాలు నిర్మించాలా? అనే విషయంలో ఆయన ఇంకా ఒక స్పష్టతకు రాలేదని తెలుస్తోంది. ఈ నిర్మాణ సంస్థ విషయమై మహేష్ బాబు త్వరలో అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అప్పుడు అతని ఆలోచనలను కూడా వెల్లడిస్తారని మహేష్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

పీవీపీ సినిమా సంస్థతో కలసి నిర్మించే తన తదుపరి చిత్రానికి మహేష్ బాబు సహనిర్మాతగా ఉండే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నిర్మించే 'బ్రహ్మాత్సవం' సినిమా షూటింగ్ మే 31న ప్రారంభం అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement