చీప్‌ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తే ఊరుకోం– శివాజీ రాజా

MAA Association Press Meet Against to Actress Sri Reddy - Sakshi

‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)’లో తనకు సభ్యత్వం ఇవ్వలేదంటూ నటి శ్రీరెడ్డి  ఫిల్మ్‌చాంబర్‌ ఎదుట  శనివారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ వివాదంపై ‘మా’ సభ్యులు ఫిల్మ్‌చాంబర్‌లో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ–‘‘తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఎవరైనా తప్పుగా మాట్లిడితే ఊరుకునేది లేదు. శ్రీరెడ్డి  మాటల్లో నిజం లేదు. చీప్‌ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తే ఊరుకోం. ‘మా’ లోని 900మంది సభ్యుల్లో ఎవరూ తనతో నటించరు. ఎవరైనా నటిస్తే ‘మా’ నుంచి సస్పెండ్‌ చేస్తాం. ఆమెకు ‘మా’ లో సభ్యత్వం ఇవ్వం’’ అన్నారు.

‘‘మా’ 25 సంవత్సరాల జూబ్లీ ఇయర్‌లో ఇలాంటి సంఘటన సిగ్గు చేటు. ఇదంతా ఆ అమ్మాయి ఎందుకు చేస్తోంది? ఫ్రీ పబ్లిసిటీ కోసమా? సైకలాజికల్‌ ప్రాబ్లమా? అర్థం కావట్లేదు. పానకంలో పుడకలాగా సినీ పరిశ్రమను శ్రీరెడ్డి నాశనం చేస్తోంది’’ అన్నారు ‘మా’ జనరల్‌ సెక్రటరీ నరేశ్‌. ‘‘శ్రీ రెడ్డి విషయంలో ‘మా’ కి సహకరిస్తాం. తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో తనకు ఇచ్చిన సభ్యత్వం రద్దు చేసి, కార్డు వెనక్కి తీసేసుకుంటాం’’ అన్నారు టీఎఫ్‌సీసీ ౖచెర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌. ‘‘ప్రతి విషయానికీ టీవీ, సోషల్‌మీడియాకి ఎక్కితే పోయేది మన పరువే. ఇలాంటివి చూసి కొత్త అమ్మాయిలు హీరోయిన్‌గా ఎలా రావాలనుకుంటారు?’’ అన్నారు ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌. మా సభ్యులు బెనర్జీ, ఉత్తేజ్, సురేష్‌ కొండేటి, హేమ, వేణు మాధవ్, ఏడిద శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top