‘లవర్స్‌ డే’ మూవీ రివ్యూ

Lovers Day Telugu Movie Review - Sakshi

టైటిల్ : లవర్స్‌ డే
జానర్ : లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : రోషన్, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, నూరీన్‌ షరీఫ్‌
సంగీతం : షాన్‌ రెహమాన్‌ 
దర్శకత్వం : ఒమర్‌ లులు
నిర్మాత :  ఎ.గురురాజ్, సి.హెచ్‌. వినోద్‌ రెడ్డి

ఒక్క కన్నుగీటుతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేసింది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. ఇక ముద్దు గన్నును పేల్చి ఎన్నో కోట్ల హృదయాలకు గాయం చేసిన ఈ అమ్మడు సోషల్‌మీడియా క్వీన్‌గా మారిపోయింది. ప్రియా వారియర్‌ పైనే ‘లవర్స్‌ డే’ మూవీ ఆధారపడి ఉందంటేనే ఎంతటి క్రేజ్‌ను సంపాదించిందో తెలిసిపోతోంది. మరి ప్రియాకు వచ్చిన క్రేజ్‌.. ఈ మూవీని గట్టెక్కేలా చేసిందా? ప్రేమికుల రోజున వచ్చిన ‘లవర్స్‌ డే’ చిత్రం ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది ఓ చూసారి చూద్దాం..

కథ :
కాలేజ్.. స్నేహితులు.. ప్రేమ.. కుళ్లు జోకులు.. సింపుల్గా చెప్పాలంటే ఈ మూవీ కథ ఇదే. రోషన్.. ప్రియ.. గాధ.. ల మధ్య జరిగే కథే ఈ చిత్రంలో ప్రత్యేకం. రోషన్.. గాధ స్నేహితులుగా మొదలై ప్రేమికులుగా మారిపోతారు. అయితే వారి ప్రేమను వ్యక్త పరిచాలనుకునే సమయానికి అనుకోని సంఘటన జరుగుతుంది. (సాక్షి రివ్యూస్‌) అనుకోని ఆ సంఘటన ఏంటి.. అసలు ఈ కథ లో వింక్‌ గర్ల్ ప్రియ వారియర్‌ పాత్ర ఏంటి అనేది మిగతా కథ.

నటీనటులు : 
కాలేజ్ కుర్రాడిగా రోషన్.. అతని స్నేహితులు బాగానే నటించారు. ముఖ్యంగా రోషన్ లవర్ బాయ్ గా అమ్మాయిల మనసు దోచేస్తాడు. ఇక ప్రియ తనకు బాగా పేరు తెచ్చిన.. కన్ను గీటే సీన్.. ముద్దు గన్ను సీన్స్‌తో థియేటర్లో విజిల్స్ కొట్టిస్తుంది. టీజర్, ట్రైలర్లను చూసి ప్రియానే మెయిన్ లీడ్ అనుకుంటే పొరపాటే. (సాక్షి రివ్యూస్‌) గాధ పాత్రలో నటించిన నూరిన్ షరీఫ్.. ప్రియా కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. అందం.. అభినయంతోనూ నూరీన్‌ ఆకట్టుకుంది. ఇక హీరో స్నేహితులు, ప్రిన్సిపాల్, లెక్చరర్, ప్యూన్ పాత్రలు నవ్విస్తాయి.

విశ్లేషణ : 
ఇలాంటి కథలు మనం ఎప్పుడో  చూసేసాం. గతంలో వచ్చిన చిత్రం, నువ్వు నేను, సొంతం లాంటి ఎన్నో సినిమాల్లో ఈ కాన్సెప్టే మనకు కనబడుతుంది. లెక్చరర్లు స్టూడెంట్స్ మధ్య వచ్చే కుళ్లు జోకులు.. ప్రేమ.. ఆకర్షణ.. స్నేహితులు.. వీటి చుట్టే తిరిగే ఈ కథ.. ఓ వయసు వారిని మాత్రం ఆకట్టుకుంటుంది. అయితే సినిమా అంతా సరదాగా వెళ్తూ ఉంటే.. మరీ నాసిరకంగా ఉంటుందేమో అనో.. లేక ముగింపు ఎలా ఇవ్వాలో తెలియక దర్శకుడు విషాదంతో సినిమాను ముగించేశాడు. (సాక్షి రివ్యూస్‌) ప్రేమకు ఆకర్షణకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుని తను నిజంగా ప్రేమిస్తున్న అమ్మాయికి తన ప్రేమను చెప్పే సందర్భంలో ఆ పాత్రను ముగించి.. అసలు దర్శకుడు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాలేదు. ఇక సంగీతం కొన్ని చోట్ల పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. 

బండ కళ్యాణ్‌, ఇంటర్‌నెట్ డెస్క్‌.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top