ఇంటర్వ్యూకు 4 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్ | Lindsay Lohan wants money, pics with Putin for interview about ex Egor | Sakshi
Sakshi News home page

ఇంటర్వ్యూకు 4 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్

Aug 22 2016 11:15 AM | Updated on Sep 4 2017 10:24 AM

ఇంటర్వ్యూకు 4 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్

ఇంటర్వ్యూకు 4 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్

టీవీ ఇంటర్వ్యూకు హాలీవుడ్ నటి లిండ్సే లోహన్ దాదాపు రూ. 4 కోట్లు(5 లక్షల ఫౌండ్లు) డిమాండ్ చేసిందట.

లాస్ ఏంజెలెజ్: టీవీ ఇంటర్వ్యూకు హాలీవుడ్ నటి లిండ్సే లోహన్ దాదాపు రూ. 4 కోట్లు(5 లక్షల ఫౌండ్లు) డిమాండ్ చేసిందట. అంతేకాకుండా గొంతెమ్మ కోరికలు కూడా తీర్చాలని షరతు పెట్టిందట. రష్యా ప్రభుత్వానికి 'చానల్ వన్'కు ఇంటర్య్యూ ఇచ్చేందుకు 30 ఏళ్ల లోహన్ 5 లక్షల బ్రిటీష్ పౌండ్లు డిమాండ్ చేసింది. దీంతో పాటు ప్రత్యేకంగా ప్రైవేట్ విమానం, భద్రత, తన  రిట్జ్-కార్లటన్ పెంట్హౌస్ లో బస, చేతులు, గోళ్ల కోసం విమానంలో సంరక్షకుడిని ఏర్పాటు చేయాలని కోరింది. అంతేకాదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో తాను ఫొటో దిగేందుకు అవకాశం కల్పించాలని షరతు పెట్టింది.

రష్యా యువ వ్యాపారవేత్త ఇగోర్ తారాబాసోవ్(22) తో సాగించిన అల్లరి ప్రేమాయణం గురించి చెప్పేందుకు ఇవన్నీ డిమాండ్ చేసింది. రష్యాలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షో 'పస్ట్ గోవోర్యత్'లో పాల్గొనేందుకు ఆహ్వానించగా ఆమె తన కోరికలు ఏకరువు పెట్టింది. ఆశ్చర్యంగా వీటిలో కొన్నింటిని నిర్వాహకులు ఆమోదించారు. అయితే తన పట్ల క్రూరంగా ప్రవర్తించడంతో ఇగోర్ తో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నట్టు ఇటీవల లోహన్ వెల్లడించింది. వీరిద్దరూ గొడవపడుతూ పలుమార్లు కెమెరాకు దొరికిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement