కృష్ణుడి విష్ణువు అవతారం! | krishnudu plays maha vishnu avataram | Sakshi
Sakshi News home page

కృష్ణుడి విష్ణువు అవతారం!

Oct 26 2013 1:54 AM | Updated on Sep 1 2017 11:58 PM

కృష్ణుడి విష్ణువు అవతారం!

కృష్ణుడి విష్ణువు అవతారం!

ఇప్పటివరకూ పలు కామెడీ పాత్రలు చేసిన కృష్ణుడు ఇప్పుడు విష్ణుమూర్తి అవతారం ఎత్తారు. అయితే తన మార్క్ కామెడీని మాత్రం వదిలిపెట్టలేదు.

 ఇప్పటివరకూ పలు కామెడీ పాత్రలు చేసిన కృష్ణుడు ఇప్పుడు విష్ణుమూర్తి అవతారం ఎత్తారు. అయితే తన మార్క్ కామెడీని మాత్రం వదిలిపెట్టలేదు. విష్ణుమూర్తి అవతారంలో కృష్ణుడు చేసిన కామెడీని ఆస్వాదించాలంటే ‘విష్ణుమూర్తి’ చిత్రాన్ని చూడాల్సిందే. కృష్ణుడు, విన్నీ ముఖ్య తారలుగా బేబీ నిహారిక సమర్పణలో సూర్యభగవాన్ క్రియేషన్స్ పతాకంపై మిత్తాన ఈశ్వర్ నిర్మించిన చిత్రం ఇది. శ్రీకర్ ప్రసాద్ దర్శకుడు.
 
  నవంబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘లవ్, సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ సమాహారంతో రూపొందించిన చిత్రం ఇది. రాజ్‌కిరణ్ ఇచ్చిన పాటలు ఎస్సెట్ అవుతాయి. ఓవర్సీస్‌లో జింగ్‌రీల్.కామ్ ద్వారా ఆన్‌లైన్లోనూ సినిమా విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముసిలి వెంకటేశ్వరరావు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement