ఇది యాక్షన్‌ కాదు.. డబుల్‌ యాక్షన్‌ | Krishnarjuna Yuddham Trailer Cross 1 Million Club | Sakshi
Sakshi News home page

Apr 1 2018 10:09 AM | Updated on Aug 17 2018 2:34 PM

Krishnarjuna Yuddham Trailer Cross 1 Million Club - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని కొత్త చిత్రం కృష్ణార్జున యుద్ధం ట్రైలర్‌ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్‌ క్లబ్‌ దాటేసి ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. 

విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లోని కృష్ణ, రాక్‌ స్టార్‌ అర్జున్‌ జయప్రకాశ్ రెండు పాత్రల్లో నాని కనిపించబోతున్నాడు. ముఖ్యంగా కృష్ణ అండ్‌ బ్యాచ్‌ చేసే సందడి ఫన్నీగా అనిపిస్తోంది. వాళ్ల మధ్య డైలాగులు పేలిపోయాయి. ఆపై ట్రైలర్‌ సీరియస్‌ మోడ్‌లో సాగింది. తమ ప్రేమ కోసం ఈ ఇద్దరు యుద్ధం చేయటం.. చివరకు ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడటం.. ‘యాక్షన్‌ కాదు.. డబుల్‌ యాక్షన్‌’... అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ ముగించేశారు. 

మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌, రుక్సర్‌ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హిప్‌ హాప్‌ తమిళ సంగీతమందిస్తున్నాడు. ఏప్రిల్‌ 12న కృష్ణార్జున యుద్ధం విడుదల కాబోతోంది.

Advertisement
 
Advertisement
Advertisement