హిట్‌ డైరెక్టర్‌తో మరోసారి ఎన్టీఆర్‌..!

Koratala Siva Movie Again With Jr Ntr - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇప్పుడు ఫుల్‌ ఫాంలో ఉన్నాడు. వరుస విజయాలతో సత్తా చాటడమే కాదు నటుడిగానూ ప్రతీ సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల రిలీజ్‌ అయిన ఈ చిత్ర టీజర్‌కు సూపర్బ్‌ రెస్సాన్స్‌ వచ్చింది.

అక్టోబర్‌లో రిలీజ్‌ కానున్న ఈ సినిమా తరువాత రామ్‌ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్‌ సినిమాలో నటించనున్నాడు తారక్. ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా ఆల్రెడీ ఓకే చెసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా తరువాత ఎన్టీఆర్‌, కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడట.

ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. సైరా షూటింగ్ పూర్తయిన వెంటనే చిరు, కొరటాల సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఆ సినిమా పూర్తయిన తరువాత కొరటాల, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌ సెట్స్ మీదకు వెళ్లనుంది. అంటే ఈ సినిమా 2020లో గాని సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top