ప్రేమలో పడేయాలని... | Kiraak Movie Release on friday | Sakshi
Sakshi News home page

ప్రేమలో పడేయాలని...

Sep 2 2014 10:32 PM | Updated on Mar 22 2019 5:33 PM

ప్రేమలో పడేయాలని... - Sakshi

ప్రేమలో పడేయాలని...

అతను పవన్‌కల్యాణ్ వీరాభిమాని. ఆమెకు మహేశ్‌బాబు అంటే పంచప్రాణాలు. ఆమెను తొలి చూపులోనే ఇష్టపడ్డాడతను. ఆమెను ఎలాగైనా ప్రేమలో పడేయాలని రకరకాల

అతను పవన్‌కల్యాణ్ వీరాభిమాని. ఆమెకు మహేశ్‌బాబు అంటే పంచప్రాణాలు. ఆమెను తొలి చూపులోనే ఇష్టపడ్డాడతను. ఆమెను ఎలాగైనా ప్రేమలో పడేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈ నేపథ్యంలో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ ‘కిరాక్’. అనిరుధ్, చాందిని ఇందులో హీరో హీరోయిన్లు. హారిక్ దేవభక్తుని దర్శకత్వంలో డి. గోపీకృష్ణ, గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇందులో ప్రేమతో పాటు కన్నకూతురు తప్పిపోతే తల్లిపడే ఆవేదన, పదిహేనేళ్ల క్రితం తప్పిపోయిన పాప కోసం అన్వేషణ... ఇవన్నీ ఉంటాయి.
 పోసాని పాత్రచిత్రణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’ అని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement