కేజీఎఫ్‌ 2 : డేట్‌ గుర్తుపెట్టుకోండి | KGF Chapter 2 Gets Release Date | Sakshi
Sakshi News home page

కేజీఎఫ్‌ 2 : డేట్‌ గుర్తుపెట్టుకోండి

Mar 13 2020 7:23 PM | Updated on Mar 13 2020 8:17 PM

KGF Chapter 2 Gets Release Date - Sakshi

కన్నడ రాక్‌స్టార్‌ యశ్‌ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్‌-2’.  ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ‘అధీరా’ పాత్రలో నటిస్తుండగా, రవీనాటండన్‌ ‘రమికా సేన్‌’ అనే పాత్రలో కనిపించనుంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం శుక్రవారం వెల్లడించింది. కేజీఎఫ్‌-2ను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 2018లో వచ్చిన కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌(కేజీఎఫ్‌) తొలి భాగం సూపర్‌ డూపర్‌ హిట్టైన విషయం తెలిసిందే. కన్నడతోపాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్‌ అయింది.

విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డులు సృష్టించి బాలీవుడ్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ దగ్గర రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దక్షిణాది పరిశ్రమ ఖ్యాతిని సగర్వంగా చాటిచెప్పింది. అమెజాన్‌ ప్రైమ్‌లోనూ అత్యధికులు వీక్షించిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇందులో యశ్‌ చేసిన రాకీభాయ్‌ పాత్రకు విశేష ఆదరణ దక్కింది. ఈ చిత్రంతో యువ హీరో యశ్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. మొదటి దాన్ని మించిపోయేలా కేజీఎఫ్‌ రెండో భాగాన్ని రూపొందిస్తున్నామని యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ సినిమాకు రవిబాసుర్‌ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై మరిన్ని భారీ అంచనాల్ని నెలకొల్పాయి. (వరల్డ్‌ రికార్డు సృష్టించిన హీరో బర్త్‌ డే కేకు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement