ఆయనకు ఇద్దరు.. మరి కీర్తి | Keerthy Suresh in Rajinikanth Movie | Sakshi
Sakshi News home page

ఆయనకు ఇద్దరు.. మరి కీర్తి

Dec 22 2019 8:11 AM | Updated on Dec 22 2019 8:11 AM

Keerthy Suresh in Rajinikanth Movie - Sakshi

సినిమా: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చిత్రం అంటేనే ప్రారంభానికి ముందు నుంచే ప్రచార హడావుడి మొదలవుతుంది. అలా ప్రతి చిత్ర నిర్మాణంలోనూ, విడుదలనంతరం కూడా కొనసాగుతుంది. అలాంటి రజనీకాంత్‌ నటించిన దర్బార్‌ చిత్రం గురించి దాదాపు అన్ని కోణాల్లోనూ ప్రేక్షకులకు చేరిపోయింది. ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకుడని, నయనతార నాయకి అని, అనిరుద్‌ సంగీతం అని, లైకా సంస్థ నిర్మాణం అని, అన్నింటికి మించి దర్బార్‌లో రజనీకాంత్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌అధికారిగా దుమ్మురేపనున్నారన్న సంగతి తెలిసిపోయింది. ఇక టీజర్‌ అదిరింది. ట్రైలర్‌ సూపరో సూపర్‌ అంటున్నారు. కాగా ఇక రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రంపై మీడియా దృష్టి సారించింది. దీని గురించి ఇప్పటికే చాలా విషయాలు ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయాయి. అయితే ఇది రజనీకాంత్‌ చిత్రం కనుక ఇంకా తెలుసుకోవాలని ఆశ పడుతుంటారు. కాగా ఇంకా పేరు నిర్ణయించిన ఈ చిత్రం వ్యవసాయం ప్రధాన ఇతివృత్తంగా ఉంటుందనే ప్రచారం జరుగుతుండడంతో రజనీకాంత్‌ యజయాని చిత్రంలో పంచె కడతారా లేక ప్యాంటు, షర్టే ధరిస్తారా అన్న ఆసక్తి నెలకింది.

ఇకపోతే శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాబట్టి ఇందులో ప్రేమతో పాటు సెంటిమెంట్‌కు యాక్షన్‌ సన్నివేశాలకు కొదవ ఉండదనే ఒక నమ్మకం రజనీకాంత్‌ అభిమానుల్లో నెలకొంది. మరో విషయం ఏమిటంటే ఇందులో ఒకప్పుడు రజనీకాంత్‌తో జత కట్టిన నటి కుష్భూ, మీనాలతో పాటు నటి కీర్తీసురేశ్‌ నటిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారా, త్రిపాత్రాభినయం చేస్తున్నారా అన్న సందదేహాలు ఏర్పడుతున్నాయి. ఈ విషయంలో తాజాగా కొంచెం క్లారిటీ వచ్చింది. ఇందులో రజనీకి భార్యలుగా నటి కుష్భూ, మీనా నటిస్తున్నారని, యువ నటి కీర్తీసురేశ్‌ ఆయనకు చెల్లెలిగానూ నటిస్తున్నట్లు తాజా సమాచారం. అయితే రజనీకాంత్‌ కుష్భూ, మీనాలకు ఆయనకిద్దరుగా నటిస్తున్నారా లేక ద్విపాత్రాభినయం చేస్తున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక నటి కీర్తీసురేశ్‌తో రొమాన్స్‌ చేసే ఆ లక్కీ నటుడెవరూ? అసలు అలాంటి పాత్ర ఉంటుందా? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డీ.ఇమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈయన రజనీకాంత్‌ చిత్రానికి సంగీతాన్ని అందించడం ఇదే ప్రప్రథం అన్నది గమనార్హం. కాగా ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో  ప్రకాశ్‌రాజ్, సూరి, శ్రీమాన్‌ నటిస్తున్నారు. చిత్రాన్ని 2020లో సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రవర్గాలు ఇప్పటికే పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement