గ్లామర్ పోటీని తట్టుకోలేకే.. | Karthika acts in annakodi film | Sakshi
Sakshi News home page

గ్లామర్ పోటీని తట్టుకోలేకే..

Dec 22 2013 9:04 AM | Updated on Sep 2 2017 1:51 AM

గ్లామర్ పోటీని తట్టుకోలేకే..

గ్లామర్ పోటీని తట్టుకోలేకే..

తన తల్లికి గురువు అయిన భారతీరాజా దర్శకత్వంలో అన్నకొడి చిత్రంలో నటించే అవకాశం రావడంతో కార్తీక ఎగిరి గంతేసింది.

ఎవడు కాదన్నా, అవునన్నా అధిక శాతం హీరోయిన్లు గ్లామర్ మీదే ఆధారపడుతుంటారు. అందాలారబోతలో ఈ తరం హీరోయిన్లు పోటీ పడుతున్నారు. అలాంటి పోటీని ఎదుర్కొన్న వారే నిలదొక్కుకుంటున్నారు. అనుష్క, నయనతార వంటి తారలు అభినయంతో పాటు అందాలారబోతలోనూ విజృంభిస్తున్నారు, మేటి కథానాయికలుగా ప్రకాశిస్తున్నారు. కాజల్ అగర్వాల్, సమంత, హన్సిక వంటి క్యూట్ గర్ల్స్ గ్లామర్ విషయంలో రెచ్చిపోతున్నారు. వీరితో నటి కార్తీక పోటీ పడలేక పోయిందనే ప్రచారం జరుగుతోంది.


 
 నిజానికి ఈ బ్లాక్ బ్యూటీ తమిళం, తెలుగు, మలయాళం భాషలలో ఐదారు చిత్రాలు చేసినా వాటిలో మంచి విజయం సాధించిన చిత్రం కో ఒక్కటే. తన తల్లికి గురువు అయిన భారతీరాజా దర్శకత్వంలో అన్నకొడి చిత్రంలో నటించే అవకాశం రావడంతో కార్తీక ఎగిరి గంతేసింది. నిజం చెప్పాలంటే ఆ చిత్రంలో ఈ భామ అభినయానికి మంచి పేరే వచ్చింది. అయితే చిత్రం అపజయం పాలవడంతో కార్తీక దిగులు పడిపోయింది. అంతేకాదు ఆ తరువాత అవకాశాలు రాలేదు.

 
అదే సమయంలో ఈమె చెల్లెలు తులసి కడల్ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ చిత్రం ఆమెను నిరాశ పరచింది. ఆ విధంగా అక్కాచెల్లెలిద్దరూ నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. దీంతో కార్తీకకు పెళ్లి చేయాలనే నిర్ణయానికి ఆమె తల్లి రాధ వచ్చినట్లు సమాచారం. వరుడివేటలో పడ్డట్టూ తెలిసింది. సరిగ్గా ఇలాంటి తరుణంలో కార్తీకకు పొరంబోకు చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. దీంతో మళ్లీ ఆశలు చిగురించడంతో పెళ్లి విషయాన్ని పక్కకు పెట్టారట. అయితే ఈ చిత్రంలోనూ కార్తీక అభినయానికి అవకాశం ఉన్న పాత్రేనట. గ్లామర్‌కు అంతగా స్కోప్ ఉండదట. మరి ఈ పాత్ర కార్తీక కెరీర్‌కు ఎంతగా ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement