మూడో పెళ్లికి సిద్ధమైన నటి మాజీ భర్త | karisma kapoor ex-husband sunjay kapur is reportedly marrying Priya Sachdev | Sakshi
Sakshi News home page

మూడో పెళ్లికి సిద్ధమైన నటి మాజీ భర్త

Mar 17 2017 9:56 AM | Updated on Sep 5 2017 6:21 AM

మూడో పెళ్లికి సిద్ధమైన నటి మాజీ భర్త

మూడో పెళ్లికి సిద్ధమైన నటి మాజీ భర్త

అలనాటి బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీష్మా కపూర్‌ మాజీ భర్త సంజయ్‌ కపూర్‌ మూడో పెళ్లికి సిద్ధం అవుతున్నాడు.

అలనాటి బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీష్మా కపూర్‌ మాజీ భర్త సంజయ్‌ కపూర్‌ మూడో పెళ్లికి సిద్ధం అవుతున్నాడు. తన ప్రేయసి మోడల్‌ ప్రియ సచ్‌దేవ్‌ను సంజయ్‌ పెళ్లాడబోతున్నాడు. వచ్చే నెలలో వీళ్లిద్దరి వివాహం న్యూయార్క్‌లో జరగనుంది. కుటుంసభ్యులతో పాటు కేవలం కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి.

 ఈ పెళ్లిపై సంజయ్‌ కపూర్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. కాగా సంజయ్‌ కపూర్‌కు ఇది మూడో పెళ్లి కాగా, ప్రియా సచ్‌దేవ్‌కి రెండో వివాహం. ప్రియా సచ్‌దేవ్ రెండేళ్ల క్రితం న్యూయార్క్ లో  సంపన్నుడైన విక్రమ్ చట్వాల్‌ను అంగరంగ వైభోగంగా పెళ్లాడింది. ఆ తర్వాత ఆ పెళ్లి పెటాకులైంది. అనంతరం సంజయ్‌ కపూర్‌తో డేటింగ్‌ చేస్తోంది. అయితే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం సంజయ్ కపూర్ తల్లికి ఇష్టం లేదట.

కాగా కరిష్మా కపూర్ వ్యాపార వేత్త సంజయ్ కపూర్ 2003 సెప్టెంబర్‌లో వివాహం జరిగింది. వీరికి 12 ఏళ్ల కూతురు సమైరా, ఏడేళ్ల కొడుకు రాజ్‌ ఉన్నారు. అయితే కరీష్మా, సంజయ్‌ కపూర్‌ మధ్య పొరపొచ్చలు రావడంతో వారి 13ఏళ్ల దాంపత్య జీవితానికి తెరపడింది. గత ఏడాది జూన్‌లో వీరిద్దరూ చట్టబద్దంగా విడాకులు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement