నీలో మా అక్క పోలికలు కనిపిస్తున్నాయి! | Kareena Kapoor finds Karisma Kapoor's 'Humshakal' in Tamannaah | Sakshi
Sakshi News home page

నీలో మా అక్క పోలికలు కనిపిస్తున్నాయి!

Mar 18 2014 12:30 AM | Updated on Sep 2 2017 4:49 AM

నీలో మా అక్క పోలికలు కనిపిస్తున్నాయి!

నీలో మా అక్క పోలికలు కనిపిస్తున్నాయి!

ఒకరినొకరు విమర్శించుకోవడంలో బాలీవుడ్ హీరోయిన్లు ఎప్పుడూ ముందే ఉంటారు. ఆఫ్ ది స్క్రీన్... అనుమానాలు, అపార్థాలు, స్పర్థలు, విమర్శలు వీటితోనే వారి స్నేహం.

 ఒకరినొకరు విమర్శించుకోవడంలో బాలీవుడ్ హీరోయిన్లు ఎప్పుడూ ముందే ఉంటారు. ఆఫ్ ది స్క్రీన్... అనుమానాలు, అపార్థాలు, స్పర్థలు, విమర్శలు వీటితోనే వారి స్నేహం. మొన్నటివరకూ కరీనాకపూర్ కూడా ఇందుకు మినహాయింపేం కాదు. అయితే... ఈ మధ్య మాత్రం కరీనా మైండ్‌సెట్‌లో మార్పొచ్చింది. పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టారు. అదెలా అంటారా? అయితే... విషయంలోకెళ్దాం. ప్రస్తుతం తమన్నా... సైఫ్ అలీఖాన్‌కి జోడీగా ‘హమ్ షకల్స్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కి అడపాదడపా కరీనా వచ్చిపోతూ ఉన్నారట. 
 
 ఈ క్రమంలో తమన్నాకు, కరీనాకు మంచి స్నేహం కూడా ఏర్పడిందట. ‘‘నిన్ను చూస్తుంటే మా అక్క కరిష్మానే చూస్తున్నట్లుంది. నీలో ఆమె పోలికలు బాగా ఉన్నాయి’’ అని ఓ సందర్భంలో తమన్నాకు కితాబు కూడా ఇచ్చేశారట కరీనా. తన భర్త సైఫ్ అలీఖాన్ పక్కన నటించే కథానాయికల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే కరీనా... తమన్నా విషయంలో మాత్రం ఇలా పాజిటివ్‌గా స్పందించడం లొకేషన్లో ఉన్నవారందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిందని వినికిడి.  అక్కడే ఉన్న కొందరు.. ‘‘అయితే... మీకు బాలీవుడ్‌లో తమన్నా రూపంలో గట్టి పోటీ వచ్చినట్లే’’ అనంటే... ‘‘పోటీ అని నేననుకోను. ఈ పరిశ్రమ విశాలమైంది. ఎంతమందికైనా ఇక్కడ స్థానం ఉంటుంది. ఇక్కడ ఎవరి స్థానం వారిదే’’ అని బదులిచ్చారట కరీనా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement