నేటి భారతీయుడు

Kamal Haasan Returns As Senapathy - Sakshi

ఆయుధాలు లేకుండా కేవలం రెండు వేళ్లతో ప్రత్యర్థులను ఎదుర్కోగలడు సేనాపతి. అవినీతిని ఆశ్రయించినవాళ్లకు సమాధానం చెబుతూ 1995లో శంకర్‌ సృష్టించిన పాత్ర ఇది. సేనాపతి పాత్రలో కమల్‌హాసన్‌ అద్భుతమైన నటనను కనబరిచారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందిస్తున్నారు శంకర్‌. మొదటి భాగంలో కమల్‌ వృద్ధ గెటప్‌లో ఎలా కనిపించారో గుర్తు చేసుకోండి. ఇప్పుడు నేటి భారతీయుడిని చూడండి. ఈ సినిమా షూటింగ్‌ రేపటి నుంచి స్టార్ట్‌ కానుంది. సంక్రాంతి స్పెషల్‌గా ఈ సినిమాలో కమల్‌ లుక్‌ను కొద్దిగా శాంపిల్‌ చూపించారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించనున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌. కమల్‌హాసన్‌ మనవడిగా సిద్దార్థ్‌ నటించనున్నారని టాక్‌. అనిరు«ద్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top