ఈసారి రొమాంటిక్ యాక్షన్ హీరో | Kalyan Ram's 'Pataas' in Dec first week | Sakshi
Sakshi News home page

ఈసారి రొమాంటిక్ యాక్షన్ హీరో

Oct 18 2014 11:16 PM | Updated on Sep 2 2017 3:03 PM

ఈసారి రొమాంటిక్ యాక్షన్ హీరో

ఈసారి రొమాంటిక్ యాక్షన్ హీరో

నందమూరి కల్యాణ్‌రామ్ మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న భారీ చిత్రం ‘పటాస్’ చిత్రీకరణ 90 శాతం పూర్తి చేసుకుంది.

నందమూరి కల్యాణ్‌రామ్ మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న భారీ చిత్రం ‘పటాస్’ చిత్రీకరణ 90 శాతం పూర్తి చేసుకుంది. ‘‘ఇదొక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఎక్కడా రాజీ పడకుండా చాలా భారీగా నిర్మిస్తున్నాం’’ అని కల్యాణ్‌రామ్ వెల్లడించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయికుమార్, బ్రహ్మానందం, ఆశుతోష్ రాణా, ఎమ్మెస్ నారాయణ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సర్వేష్ మురారి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ‘‘దర్శకుడు అనిల్ ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. మిగిలిన చిత్రీకరణను కూడా పూర్తి చేసి డిసెంబర్ మొదటి వారంలో సినిమా విడుదల చేస్తాం’’ అని కల్యాణ్‌రామ్ వివరించారు. ఈ యాక్షన్ చిత్రానికి రామ్-లక్ష్మణ్‌లు పోరాటాలు సమకూరుస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement