‘ఎన్టీఆర్‌’లో క్యారెక్టర్‌పై కల్యాణ్ రామ్‌ క్లారిటీ

Kalyan Ram Reveals About His Role In NTR - Sakshi

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాను బాలయ్య స్వయంగా నిర్మిస్తున్నారు. ముందుగా ఈ బయోపిక్‌ను తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ప్రాజెక్ట్‌నుంచి తప్పుకోవటం క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్టు గా ప్రకటించారు.

ఈ సినిమాలో హరికృష్ణ పాత్రలో నందమూరి కల్యాణ్ రామ్‌ నటిస్తున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కల్యాన్‌ రామ్‌ క్లారిటీ ఇచ్చారు. ఈ గురువారం రిలీజ్‌కు రెడీ అవుతున్న నా నువ్వే సినిమా ప్రమోషన్‌ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కల్యాణ్‌ రామ్‌.. ఎన్టీఆర్‌ బయోపిక్‌ విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని తెలిపారు. గతంలో తేజ ఎన్టీఆర్‌ సినిమాలో ఓ పాత్ర చేయాలని కోరారని.. కానీ ఏ పాత్ర అన్నది చెప్పలేదని తెలిపారు. దీంతో ఎన్టీఆర్‌ బయోపిక్‌ లో కల్యాన్‌ రామ్‌ నటిస్తున్నాడంటూ వస్తున్న వార్తలకు తెరపడింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top