జ్యోతిష్యానికే జ్వరం వచ్చేలా ఉంది

Kalyan Ram Naa Nuvve Trailer Released - Sakshi

‘ఏ బోండాం. ఖాళీగానే ఉన్నావు కదా? ఇంకో వన్‌ మినిట్‌ తనని వెళ్లకుండా ఆపుంటే నీ సొమ్మేం పోయేది.. ఏంటే లవ్వా? చేస్తే తప్పేంటి?... ఇదేం ట్విస్ట్‌ బావా.. జ్యోతిష్యానికే జ్వరం వచ్చేలా ఉంది... నా ప్రేమ, నా బాధ అందరికీ వినపడుతుంది. నీకు వినిపించటం లేదా?’ వంటి డైలాగులు ‘నా నువ్వే’ సినిమాపై క్రేజ్‌ పెంచుతున్నాయి. కల్యాణ్‌ రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా నువ్వే’. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ నిర్మాణంలో కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌ వట్టికూటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.జయేంద్ర మాట్లాడుతూ –‘‘ఎగ్జయిటింగ్‌ ఫిల్మ్‌ ఇది. కల్యాణ్‌రామ్‌ గత సినిమాలకు భిన్నంగా ఉంటుంది. తమన్నా లాంగ్‌ కెరీర్లో ఇందులో చాలా కొత్తగా కనపడుతుంది. సినిమా చూసే ప్రేక్షకులకు ఫ్రెష్‌ ఫీలింగ్‌ ఇస్తుంది’’ అన్నారు. ‘‘లవబుల్, రొమాంటిక్‌ మూవీ ఇది. ట్రైలర్‌ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. సెన్సార్‌ ప్రాసెస్‌ స్టార్టయ్యింది. 25న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత మహేశ్‌ కోనేరు. ‘‘నా నువ్వే’ టీమ్‌తో యూఎస్‌ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్, యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ చేయబోతున్నాం’’ అన్నారు కిరణ్‌ ముప్పవరపు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top