వాటిని మించేలా... | kalinga movie Started | Sakshi
Sakshi News home page

వాటిని మించేలా...

Jun 11 2015 10:42 PM | Updated on Sep 3 2017 3:35 AM

వాటిని మించేలా...

వాటిని మించేలా...

ఎల్లో లైన్ పిక్చర్స్ పతాకంపై ‘రఘపతి వెంకయ్యనాయుడు’ వంటి ఉత్తమ చిత్రాన్ని నిర్మించిన శాంతి శ్రీ మండవ నిర్మిస్తున్న ‘కళింగ’

 ఎల్లో లైన్ పిక్చర్స్ పతాకంపై ‘రఘపతి వెంకయ్యనాయుడు’ వంటి ఉత్తమ చిత్రాన్ని నిర్మించిన శాంతి శ్రీ మండవ నిర్మిస్తున్న ‘కళింగ’ హైదరాబాద్‌లో ఆరంభమైంది. సతీశ్‌బాబు, పావని జంటగా బేబి నిత్యసాయి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి కేయస్ నాగేశ్వరరావు దర్శకుడు. ముహూర్తపు దృశ్యానికి ఫొటోగ్రాఫర్ మధు కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత సి. కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ స్క్రిప్ట్ అందించారు. కేయస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘‘మంచి కుటుంబ కథకు, యాక్షన్, కామెడీ జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రెండు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేశాం’’ అన్నారు. శ్రీహరితో పోలీస్, దేవా, సాంబయ్య వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కేయస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉందని, వాటిని మించేలా ఈ సినిమా వుంటుందని సతీశ్‌బాబు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement