కాజలా మజాకా!

కాజలా మజాకా!


తమిళసినిమా: కథానాయికలు ఎంత అభినయానికి ప్రాముఖ్యతనిచ్చినా, వారికి అందమే ప్రధాన అలంకారం. ఎవరు అవునన్నా, కాదన్నా అభిమానులు హీరోయిన్ల నుంచి ఆశించేది సౌందర్యాన్నే. ఈ విషయం వారికీ తెలుసు. అందుకే అందాలను మెరుగు పరుచుకోవడానికి వ్యాయామం లాంటి కసరత్తులు కాస్త ఎక్కువగానే చేస్తుంటారు. నటి కాజల్‌ అగర్వాల్‌ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని చెప్పవచ్చు. కొత్తగా హీరోయిన్ల రాక అధికం అవుతోంది.నవ అందాలతో వారు దూసుకుపోతున్నారు. వారి పోటీ తట్టుకోవాలంటే కాజల్‌ లాంటి వారికి అందం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరమే. ఆమె తరువాత సినీరంగప్రవేశం చేసిన సమంత, ఎమీజాక్సన్, శ్రుతీహాసన్, కీర్తీసురేశ్‌ వంటి నటీమణులు సీనియర్‌ హీరోయిన్ల  అవకాశాలను తన్నుకుపోతున్నారు. కాగా దశాబ్ద కాలంగా హీరోయిన్‌గా కోలీవుడ్, టాలీవుడ్‌లలో హీరోయిన్‌గా రాణిస్తున్న కాజల్‌ అగర్వాల్‌ తనకు అలాంటి పరిస్థితి రాకూడదని  భావిస్తోందట.తన క్రేజ్‌ తగ్గకుండా చూసుకోవాలన్న విషయంలో చాలా క్లియర్‌గా ఉన్న కాజల్‌ అగర్వాల్‌ ఇప్పుడు అందం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందనిపిస్తోంది. కాజల్‌ చేతిలో ప్రస్తుతం రెండు తమిళ చిత్రాలున్నాయి. వాటిలో ఒకటి వివేగం. అజిత్‌కు జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో కాజల్‌ ట్రాన్స్పరెంట్‌ చీరను ధరించి పాల్గొనడంతో చూపరుల దృష్టి అంతా ఆ అమ్మడిపైనే పడుతోందట. దీంతో తన టెక్నిక్‌ ఫలించిందని సంతోష పడిపోతోందట. ఈ అందం గొడవ పక్కన పెడితే ఈ జాణకు కొత్తగా అవకాశాలేవీ కనుచూపు మేరలో కనిపించడం లేదంటున్నారు సినీ వర్గాలు. అజిత్‌తో రొమాన్స్‌ చేస్తున్న వివేగం, విజయ్‌తో డ్యూయెట్లు పాడుతున్న మెర్సల్‌ చిత్రాలు తెచ్చి పెట్టే పేరు పైనే కాజల్‌ ఆశలు పెట్టుకుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top