సాక్షి, సిటీబ్యూరో : ఇందుగలడు అందులేదను సందేహంబు వలదన్నట్లు.. మార్కెట్‌లో ట్రెండ్ సృష్టిస్తోన్న ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)అన్నింటా చొచ్చుకుపోతోంది. సాంకేతికంగా ప్రగతి పధంలో ఉన్న నగరంలో ఇది మరింత స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా సౌందర్య చికిత్సలు అందించేందుకు ఏఐ ఆధారిత క్లినిక్ నగరంలో ఏర్పాటుకావడం విశేషం. కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్స్ రోడ్డులో ఏర్పాటైన మైరా ఈస్తటిక్ సెంటర్ (మ్యాక్)ను ప్రముఖ టాలీవుడ్ తారలు హెబ్బా పటేల్, సత్యకృష్ణన్ సందర్శించారు.
సినీతారలకు మాత్రమే కాదని, ప్రతి ఒక్కరికీ అందం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోందనడంలో సందేహం లేదన్నారు. ప్రస్తుతం ఆడ, మగ వ్యత్యాసం లేకుండా అందరికీ సౌందర్య చికిత్సలు అవసరం అవుతున్నాయ న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌందర్య పోషణ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్ల సేవలు మరింత ఉపయుక్తమవుతాయని వీరు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మ్యాక్ వ్యవస్థాపకురాలు శ్రీవల్లి కొర్రపాటి మాట్లాడుతూ దేశంలోనే ప్రప్రథమ ఏఐ ఆధారిత క్లినిక్‌గా తాము అందించే చికిత్సలు మరింత ఖచ్చితత్వంతో ఉంటాయన్నారు.
ఇదీ చదవండి: World Vegan Day 2025 శాకాహారంతో ఆరోగ్య ప్రయోజనాలు


