ఇదే మూడో భాగం! | James Cameron Says Terminator Genisys Is the Real Terminator 3 | Sakshi
Sakshi News home page

ఇదే మూడో భాగం!

Jun 9 2015 11:26 PM | Updated on Sep 3 2017 3:28 AM

ఇదే మూడో భాగం!

ఇదే మూడో భాగం!

‘టెర్మినేటర్’ సినిమాతో ప్రపంచ సినిమా గమనాన్ని మార్చిన దర్శకుడు జేమ్స్ కామెరూన్. దానికి రెండో భాగాన్ని కూడా తెరకెక్కించారు.

 ‘టెర్మినేటర్’ సినిమాతో ప్రపంచ  సినిమా గమనాన్ని మార్చిన దర్శకుడు జేమ్స్ కామెరూన్. దానికి రెండో భాగాన్ని కూడా తెరకెక్కించారు. ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ హీరోగా తెరకెక్కిన ఈ రెండు చిత్రాలూ ఘనవిజయం సాధించి, తర్వాత ఆ తరహా చిత్రాలకు ఓ రెఫరెన్స్‌లా నిలిచాయి. కానీ, వాటికి కొన సాగింపుగా వ చ్చిన ‘రైజ్ ఆఫ్ మెషీన్స్, సాల్వేషన్ ’ చిత్రాలు ఆశించినంత విజయం సాధించలేదు. జేమ్స్ కామెరూన్ మాత్రం తాను నిర్మించిన రెండు చిత్రాలకు అసలు సిసలు సీక్వెల్ రానున్న ‘టెర్మినేటర్ జెనిసిస్’ అంటున్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ -‘‘మూడు, నాలుగు భాగాలు ‘టెర్మినేటర్’ స్థాయిని అందుకోలేదు కానీ అలెన్ టేలర్ దర్శకత్వం వహించిన కొత్త చిత్రం ‘టెర్మినేటర్ జెనిసిస్’ అత్యున్నత ప్రమాణాలతో చాలా బాగా రూపొందింది’’ అన్నారు. ఈ నెల 25న ఈ హాలీవుడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement