ప్రేమ.. భయం

Item movie launch  - Sakshi

జితేందర్, రాకేష్, ‘వైరస్‌’ సినిమా ఫేమ్‌ గీతా షా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఐటమ్‌’. íసిరి సంపద సమర్పణలో నాగరాజు తలారి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సమర్పకులు రాఘవేంద్ర కెమెరా స్విచ్చాన్‌ చేయగా నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌ క్లాప్‌ ఇచ్చారు.

నటి కవిత గౌరవ దర్శకత్వం వహించారు. నాగరాజు తలారి మాట్లాడుతూ– ‘‘లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది. హారర్‌ ఎలిమెంట్స్‌ జోడించాము. ఈ నెల 20న తొలి షెడ్యూల్‌ ప్రారంభించి జనవరి 15 వరకు చేస్తాం. మార్చి ఎండింగ్‌లో సెకండ్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు.  ఈ చిత్రానికి కెమెరా: రవి బైపల్లి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top