ఇరండాం ఉలగం ఈ నెల 22న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఆర్య, అనుష్క తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇరండాం ఉలగం.

ఇరండాం ఉలగం ఈ నెల 22న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఆర్య, అనుష్క తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇరండాం ఉలగం. దీన్ని పీవీపీ సినిమా సంస్థ అత్యంత భారీ ఖర్చుతో నిర్మించింది. సెల్వరాఘవన్ అద్భుత సెల్యులాయిడ్ సృష్టి. హారిష్ జయరాజ్ పాటలకు బాణీలు కట్టారు. అనిరుద్ నేపథ్య సంగీతాన్ని అందించారు.
రెండేళ్లకు పైగా చిత్ర నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం మంగళవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. చిత్రానికి ఒక్క కట్ కూడా లేకుండా యు సర్టిఫికెట్ రావడంతో పాటు అద్భుతమైన కాన్సెఫ్ట్‌తో రూపొందించిన చిత్రం ఇరండాం ఉలగం అని సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉందని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. వర్ణ పేరుతో తెలుగులోను అనువాదమవుతున్న ఈ చిత్రం ఈ నెల 22న తెరపైకి రానుంది.