ఎస్‌.పి.బాలుకు కీమా సంగీత అవార్డు

ఎస్‌.పి.బాలుకు కీమా సంగీత అవార్డు


బొమ్మనహళ్లి : సంగీత రంగంలో ఉత్తమ సేవలను అందించిన వారికి ఇచ్చే నాల్గవ కన్నడ అంతర్జాతీయ సంగీత అవార్డు (కీమా)ను సీనియర్‌ గాయకుడు ఎస్‌.పి.బాల సుబ్రహ్మణ్యంకు శుక్రవారం రాత్రి అందజేశారు. బాలుతో పాటు బీఎస్‌ వేణుగోపాల్, సంగీత దర్శకుడు రఘు దీక్షత్‌లకు కూడా ఈ అవార్డును అందజేశారు. ఇందులో అత్యుత్తమ సంయోజన అవార్డును హరికావ్యకు, జనప్రియ పాటలు పాడే విభాగంలో సంగీత దర్శకుడు అజనీష్‌ లోకనాథ్‌కు, అత్యుత్తమ సాహితీవేత్త జయంత్‌ కాయ్కిణి, అత్యుత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ చేతన్ నాయక్, అత్యుత్తమ ప్లేబ్యాక్‌ గాయని సమన్వియ శర్మ, వాయిద్య సంయోజకుడు ఆర్‌.ఎస్‌. గణేష్‌ నారాయణలకు అవార్డులు అందజేశారు. శుక్రవారం రాత్రి బెంగళూరు నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో కన్నడ సీనియర్‌ నటుడు శ్రీనాథ్, నిర్మాత రఘునాథ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top