కురుక్షేత్రంలో ఖిల్జీ! | Impressed by Khilji act, Aamir offers Ranveer a role in Mahabharat? | Sakshi
Sakshi News home page

కురుక్షేత్రంలో ఖిల్జీ!

Feb 22 2018 12:09 AM | Updated on Feb 22 2018 12:09 AM

Impressed by Khilji act, Aamir offers Ranveer a role in Mahabharat? - Sakshi

ఆమిర్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌

కర్ణుడా.. దుర్యోధనుడా.. అర్జునుడా.. భీముడా.. రణ్‌వీర్‌ సింగ్‌ ఏ రోల్‌ చేస్తే బాగుంటుందంటారు? ఇదిగో ఇలాంటి చర్చే జరుగుతుంది బీటౌన్‌లో. ఎందుకంటే బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘మహాభారతం’లో రణ్‌వీర్‌ నటించనున్నారట. ఎప్పటినుంచో ఈ ప్రాజెక్ట్‌ పనిలో ఉన్న ఆమిర్‌ రీసెంట్‌ టైమ్స్‌లో కాస్త స్పీడ్‌ పెంచారు. రణ్‌వీర్‌ సింగ్‌తో చర్చలు జరిపారు.

రణ్‌వీర్‌ని తీసుకోవాలని ఆమిర్‌ అనుకోవడానికి కారణం ‘పద్మావత్‌’ సినిమా. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, షాహిద్‌ కపూర్, రణ్‌వీర్‌సింగ్‌ ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రంలో ఖిల్జీ పాత్రలో అందర్నీ మెప్పించారు రణ్‌వీర్‌. ఆమిర్‌ ఖాన్‌ కూడా ఖిల్జీకి ఫిదా అయ్యారు. అంతకుముందు రణ్‌వీర్‌ చేసిన పాత్రలు ఇష్టమైనప్పటికీ ఖిల్జీ పాత్ర ఆయనకు బాగా నచ్చిందట.

అందుకే మహాభారతం సినిమా తీస్తే అందులో ఏ క్యారెక్టర్‌ సూట్‌ అవుతుందా? అని రణ్‌వీర్‌తోనే చర్చలు జరిపారు. రీసెంట్‌గా ఓ ప్రైవేట్‌ ప్రోగ్రామ్‌ కోసం కలిసిన వీళ్లు.. మరో కార్యక్రమం కోసం మళ్లీ కలిశారు. అక్కడే ఇద్దరి మధ్య మహాభారతం గురించిన టాపిక్‌ వచ్చిందట. ఈ సంగతి ఇలా ఉంచితే ప్రస్తుతం ‘గల్లీబాయ్‌’ చిత్రంతో రణ్‌వీర్, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందోస్తాన్‌’ సినిమాతో ఆమిర్‌ బిజీగా ఉన్నారు. మరి.. ‘మహాభారతం’ పట్టాలెక్కేదెప్పుడు? కాలమే చెప్పాలి.

Advertisement
 
Advertisement
Advertisement