వరుణ్‌లాంటి భర్త కావాలి! | ileana want get husband like varun Dhawan hero | Sakshi
Sakshi News home page

వరుణ్‌లాంటి భర్త కావాలి!

Mar 24 2014 12:23 AM | Updated on Apr 3 2019 6:23 PM

వరుణ్‌లాంటి భర్త కావాలి! - Sakshi

వరుణ్‌లాంటి భర్త కావాలి!

మీకెలాంటి భర్త కావాలి? అని ఇలియానాను అడిగితే.. నిన్న మొన్నటివరకు ‘మంచి లక్షణలుండాలి, నన్ను బాగా చూసుకోవాలి, అందగాడై ఉండాలి..

 మీకెలాంటి భర్త కావాలి? అని ఇలియానాను అడిగితే.. నిన్న మొన్నటివరకు ‘మంచి లక్షణలుండాలి, నన్ను బాగా చూసుకోవాలి, అందగాడై ఉండాలి..’ ఇలా ఏవేవో చెప్పేవారు. ఇప్పుడు కూడా ఇవన్నీ చెబుతున్నారు. వాటన్నిటికీ తోడు ఇప్పుడు ‘నాకు వరుణ్‌లాంటి భర్త కావాలి’ అని కూడా పేర్కొన్నారు. మన టాలీవుడ్ హీరోలు వరుణ్ సందేశ్, వరుణ్ తేజ్‌ల గురించి కాదు... ఇలియానా చెబుతున్నది.
 
 బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ గురించి. అతని సరసన ఇలియానా నటించిన ‘మై తేరా హీరో’ వచ్చే నెల 4న విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ చక్కటి అనుభూతినిచ్చిందని, ముఖ్యంగా వరుణ్‌తో సినిమా చేయడం ఓ మంచి అనుభవం అని ఇలియానా చెబుతూ - ‘‘నేనిప్పటివరకు బాలీవుడ్‌లో రణబీర్ కపూర్, షాహిద్ కపూర్‌తో కలిసి సినిమాలు చేశాను. కానీ, వాళ్లిద్దరితో కన్నా నాకు వరుణ్‌తో మంచి అనుబంధం కుదిరింది. వరుణ్ చూడచక్కగా ఉంటాడు.

మంచి పరిణతి గల వ్యక్తి. సందర్భానుసారం మాట్లాడతాడు. అనవసరమైన మాటలు మాట్లాడడు. వరుణ్‌లో నాకు అది నచ్చుతుంది. టోటల్‌గా చెప్పాలంటే తను ‘కంప్లీట్ మేన్’. అందుకే వరుణ్ లాంటి భర్త కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ మాటలు విన్న వరుణ్ చిరునవ్వు నవ్వుకున్నారట. మీకెలాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటున్నారనే ప్రశ్న వరుణ్ ముందుంచితే - ‘‘దాని గురించి ఆలోచించలేదు. కానీ, కచ్చితంగా సినిమా హీరోయిన్‌ని మాత్రం పెళ్లాడను’’ అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement