వరుణ్ ధావన్ బాలీవుడ్‌లో ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే కృతిసనన్‌తో కలిసి ఆయన నటించిన బేఢియా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఆలియా భట్‌తో కలిసి ముంబయిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు యంగ్ హీరో. ఈ సందర్బంగా ఆలియా భట్‌తో పాటు పాల్గొన్న వరుణ్ ధావన్‌కు ఉహించని ప్రశ్న ఎదురైంది.
ఆలియా భట్ ఇటీవలే తల్లి అయ్యారు కదా.. మీరెప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారంటూ వరుణ్ ధావన్‌ను ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ..'నేను కూడా ప్లాన్ చేయాల్సిందే. ఈ విషయంపై వదినతో మాట్లాడుతున్నా.. ఈరోజు నుంచే ప్లాన్ షురూ చేద్దాం.' నవ్వుతూ సమాధామిచ్చారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అలియా తల్లి అయినందుకు అభినందనలు తెలిపారు.
కాగా.. ఇటీవల అలియా, రణబీర్ కపూర్ జంటకు నవంబర్ 2022లో ఆడపిల్లను జన్మించిన సంగతి తెలిసిందే. వారి కుమార్తెకు రాహా అని పేరు పెట్టారు. వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌ను జనవరి 24, 2021న అలీబాగ్‌లో వివాహం చేసుకున్నారు. కాగా.. ఆలియా.. కరణ్ జోహార్ మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో రణ్‌వీర్ సింగ్, ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీలతో నటించనుంది. మరోవైపు వరుణ్ చివరిగా భేదియాలో కృతి సనన్‌తో కనిపించాడు. తర్వాత జాన్వీ కపూర్‌తో కలిసి బవాల్‌లో కనిపించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment