వాళ్లిద్దరిపై నాకు నమ్మకం ఉంది: మాధురీ దీక్షిత్ | I was confident about Vishal, Abhishek: Madhuri Dixit | Sakshi
Sakshi News home page

వాళ్లిద్దరిపై నాకు నమ్మకం ఉంది: మాధురీ దీక్షిత్

Dec 15 2013 4:42 PM | Updated on Sep 2 2017 1:39 AM

వాళ్లిద్దరిపై నాకు నమ్మకం ఉంది: మాధురీ దీక్షిత్

వాళ్లిద్దరిపై నాకు నమ్మకం ఉంది: మాధురీ దీక్షిత్

'డేఢ్ ఇష్కియా' చిత్ర రూపకర్తలు విశాల్ భరద్వాజ్, అభిషేక్ చౌబేలపై నమ్మకం ఉండటం వల్లే తానా సినిమాలో నటించానని రెండో ఇన్నింగ్స్లో కూడా అదరగొడుతున్న మాధురీ దీక్షిత్ తెలిపింది.

'డేఢ్ ఇష్కియా' చిత్ర రూపకర్తలు విశాల్ భరద్వాజ్, అభిషేక్ చౌబేలపై నమ్మకం ఉండటం వల్లే తానా సినిమాలో నటించానని రెండో ఇన్నింగ్స్లో కూడా అదరగొడుతున్న మాధురీ దీక్షిత్ తెలిపింది. 2007లో ఆజా నచ్లే సినిమాతో ఆమె మళ్లీ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 2010లో వచ్చిన 'ఇష్కియా' చిత్రం బ్రహ్మాండంగా హిట్ కావడంతో దర్శకుడు చౌబే మరోసారి నిర్మాత విశాల్ భరద్వాజ్తో కలిసి 'డేఢ్ ఇష్కియా' సినిమా తీశాడు.

''ఈ స్క్రిప్టు కోసం నేను ఏడు సంవత్సరాలు వేచి ఉండదలచుకోలేదు. అందుకు నా కారణాలు నాకున్నాయి. ఇంతకుముందు నేను ఇక్కడ ఉండలేదు కూడా. నేను విదేశాల్లో ఉండేదాన్ని. ఇక్కడికొచ్చి పనిచేసి వెళ్లిపోయేదాన్ని. అందుకే నేను దేని కోసం వేచి ఉండేదాన్ని కాదు'' అని మాధురి తెలిపింది. కానీ 'డేఢ్ ఇష్కియా' చిత్రం ఆఫర్ వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడికొచ్చి స్క్రిప్టులు చదివి చేయాలని నిర్ణయించుకుని, అందుకే మళ్లీ ఇండియా వచ్చి ఇక్కడే స్థిరపడ్డానని చెప్పారు. విశాల్, అభిషేక్ కలిస్తే మంచి సినిమాలు వస్తాయన్న నమ్మకం తనకుందని, అందులో భాగం కావడం తనకూ ఇష్టమేనని మాధురి చెప్పింది. ఈ సినిమాలో ఇంకా నసీరుద్దీన్ షా, హుమా ఖురేషీ, అర్షద్ వార్సీ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement