ప్రామిస్ డే: మియా మాల్కోవా మీద వర్మ ప్రామిస్.. | I promise that I will never keep a promise, says Ram Gopal Varma | Sakshi
Sakshi News home page

ప్రామిస్ డే: మియా మాల్కోవా మీద వర్మ ప్రామిస్..

Feb 11 2018 4:13 PM | Updated on Feb 11 2018 4:15 PM

I promise that I will never keep a promise, says Ram Gopal Varma - Sakshi

సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రామిస్ చేశారు. ప్రామిస్ డే రోజు డైరెక్టర్ వర్మ చేసిన ప్రామిస్‌కు అనూహ్య స్పందన వస్తోంది. సాధారణంగా దేవుడి మీద ఒట్టు, అమ్మ మీద ఒట్టు (గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్) అని చెబుతుంటారు కదా.. అందుకు వర్మ కాస్త భిన్నంగా కొందరు వ్యక్తులపై ప్రామిస్ చేస్తూ చేసిన ట్వీట్‌ వైరల్ అవుతోంది. ప్రామిస్ డే రోజు ఓ ప్రామిస్ చేస్తున్నా... నేను ఏనాడు చేసిన మాటపై నిలబడనని, ఇచ్చిన మాట నిలబెట్టుకోనని ప్రామిస్ చేస్తున్నానంటూ వర్మ తొలుత ఓ ట్వీట్ చేశారు.

దేవుడిపై గానీ, తన తల్లిపై గానీ తాను ఆ ప్రామిస్ చేయడం లేదన్నారు వర్మ. అందుకు బదులుగా.. అమితాబ్ బచ్చన్, నాగార్జున, స్టీవెన్ స్పిల్‌బర్గ్, అయన్ ర్యాండ్, డావూద్ ఇబ్రహీం, బ్రూస్‌ లీ మరియు మియా మాల్కోవాలపై ప్రామిస్ డే రోజు ప్రామిస్ చేస్తున్నాను. ఈ ఏడాది నేను చాలా మంచి బాధ్యతాయుత వ్యక్తిగా ఉండేందుకు తీవ్రంగా కష్టపడతాను' అంటూ మరో ట్వీట్‌లో రాసుకొచ్చాడు డైరెక్టర్ వర్మ. మియా మాల్కోవాపై వర్మ ప్రామిస్ చేస్తున్నారు.. మాట నిలబెట్టుకుంటారో లేదో వేచిచూద్దాం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునతో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఓ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నాగ్‌ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement