హీరోలు చేస్తే ఒప్పా?

I am acting with Vijay, engaged to Rakshit - Sakshi

టాలీవుడ్‌లో కథానాయికగా అడుగుపెట్టడానికి ముందే కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టితో ఏడడుగులు వేయడానికి రెడీ అయ్యారు కన్నడ నటి రష్మికా మండన్నా. రక్షిత్‌తో ఆమె నిశ్చితార్థం కూడా పూర్తయింది. ‘ఛలో’ తర్వాత తెలుగులో ఆమె చేసిన చిత్రం ‘గీత గోవిందం’. విజయ్‌ దేవరకొండ హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సోషల్‌ మీడియాలో ఆమె కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేశారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత సినిమాలో మితి మీరిన రొమాన్స్‌ అవసరమా? అంటూ కొందరు నెటిజన్స్‌ రష్మికపై కామెంట్స్‌ విసిరారు.

ఈ  కామెంట్స్‌ గురించి రష్మిక స్పందన ఇలా ఉంది. ‘‘గీత గోవిదం’ పోస్టర్స్‌ చూసి కొందరు అసభ్యకరమైన కామెంట్స్‌ చేస్తున్నారు. యాక్టర్‌గా నా ఎదుగుదలను ఓర్వలేక ఇలాంటి కామెంట్స్‌ చేస్తున్నారా? అనిపిస్తోంది. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆన్‌స్క్రీన్‌పై హీరోయిన్స్‌తో హీరోలు రొమాన్స్‌ చేస్తున్నారు కదా? అది తప్పు కాదా? పెళ్లి చేసుకున్న తర్వాత ఆన్‌స్క్రీన్‌పై హీరోయిన్స్‌ రొమాన్స్‌ చేస్తే మాత్రం వాళ్ల గౌరవం తగ్గిపోతుందా? ఈ ఆలోచనలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. నేను రక్షిత్‌తో ఎంగేజ్‌ అయ్యానని, విజయ్‌ దేవర కొండతో యాక్ట్‌ చేస్తున్నానని అసూయ పడేవాళ్లే నెగటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారే మో’’ అన్నారు రష్మిక.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top